Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-రఘునాథపల్లి
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం తప్పదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మండలంలోని శ్రీమన్ నారాయణపురం గ్రామంలో శాఖ మహాసభలు ఆదివారం నిర్వహించారు. గంగాపురం మహేందర్‌ను శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కుమ్మరికుంట్ల దాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతున్నదన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం వల్ల 30 శాతం ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డునపడుతున్నారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగం దివాళాతీయనున్నదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో మతంరంగు పులుమి లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని అన్నారు. దీనిని ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకటరాజ్యం, మండల కార్యదర్శి పొదల నాగరాజు, జిల్లాపెళ్లి శ్రీనివాస్, తుడి పోషయ్య, తుడి భాస్కర్, తిప్పారపు రామచంద్రు, కిష్టయ్య, తుడి శ్రీనివాస్, ఉడుత ప్రభాకర్, తుడి రేణుక, సాలమ్మ, లక్ష్మి, రాజమని, రజిత, మల్లేషం, అభిలాష్, ఎల్లమ్మ పాల్గొన్నారు.