Authorization
Sat March 22, 2025 11:47:31 pm
కలెక్టర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి
నవతెలంగాణ-జనగామ రూరల్
జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించా లని టీడబ్ల్యూజేఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షులు కొంగరి అర్జున్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనగామ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన, ధర్నా నిర్వహించారు. అనంతరం సీసీ భాస్కర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికే యులు ఎండభట్ల భాస్కర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున జర్నలిస్టుల డిమాండ్స్ డే గా ప్రకటించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. అర్హులైన జర్నలిస్టులం దరికీ ఇండ్ల స్థలాలివ్వాలన్నారు. జర్నలిస్టులు సొంత ఇండ్లు లేక అద్దె ఇండ్లల్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందు లతో సతమతమవుతున్నారన్నారు. విలేకరిగా పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతున్న ప్రభుత్వా లను ప్రశ్నించే జర్నలిస్టులను వేధింపులకు గురి చేయడం సరికాదని అన్నారు. దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులు ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం అందించాలని అన్నారు. కరోనా పాజిటివ్ వున్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వంమే భరిం చాలని చెప్పారు. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించి, అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్న పత్రికలు, కేబుల్ టీవీ, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రస్థాయి మీడియా కమిషన్, జర్నలిస్ట్ మీడియా కమిషన్, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. మీడియా అకాడమీకి బడ్జెట్ పెంచి, సమాచార శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ నియమించాలన్నారు. పత్రికా కార్యాలయాల్లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిం చాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతకింది క్రిష్ణమూర్తి, మాలోత్ రాజు, గుండె అనిల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు.