Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని, 18 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీిహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ పట్టణంలోని 28 వ వార్డు గుండ్లగడ్డ, 30వ వార్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డు పరిధిలో 18ఏండ్లు పైబడిన వారు టీకా తీసుకున్నది, లేనిది అడిగి తెలుసు కున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల సర్వే పూర్తిచేసి వ్యాక్సినేషన్ పూర్తి చేయాల న్నారు. జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాల్లో, అవాసాల్లో 104 కేంద్రాలు, పట్టణ పరిధిలో 30 వార్డుల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జిల్లాలో 3 లక్షల 89 వేల 746 మంది 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని గుర్తించి, వ్యాక్సినేషన్ కు లక్ష్యంగా చేపట్టగా, ఇప్పటికి 2 లక్షల 13 వేల 850 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి భయం, అపోహలు వద్దని అన్నారు. వ్యాక్సిన్ చేసుకున్న తర్వాత కోవిడ్ వస్తే, ప్రాణాపాయ పరిస్థితి వరకు వెళ్ళరని, శరీరం వ్యాక్సిన్ ప్రభావంతో నియంత్రణ శక్తిని కల్గి ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైన దని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు ఎవరైనా తీసుకోవచ్చని అన్నారు. జిల్లాలో వ్యాక్సిన్ తీసుకోని వారుంటే, వెంటనే తీసుకోవాలని, ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. జనగామ ఆర్డీవో మధు మోహన్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, ఉప జిల్లా వైద్య, ఆరోగ్యాధికారులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కరుణశ్రీ, 30 వార్డ్ కౌన్సిలర్ బి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
అపోహలొద్దు : మున్సిపల్ చైర్పర్సన్
నవతెలంగాణ-భూపాలపల్లి
కరోనా టీకా పట్ల అపోహలు వద్దని, 18 ఏడ్లు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి 1 వ వార్డు గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, 20 వ వార్డు స్పెషల్ డ్రైవ్ కోవిడ్ టీకా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రోజుకు వంద మంది చొప్పున టీకా వేయించుకోవాలని సూచించారు. అనంతరం భూపాలపల్లి శాంతినగర్‌లో టీకా కార్యక్ర మాన్ని నిర్వహించారు. టీకాకు భయపడి పరిగె డుతున్న అశోక్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్ పర్సన్ టీకా పట్ల అవగాహన కలిగించి టీకా వేయించారు. కౌన్సిలర్లు ముంజల రవీందర్‌గౌడ్, చల్ల రేణుక పాల్గొన్నారు.
టేకుమట్ల : వ్యాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. సోమవారం స్థానిక హెల్త్ సబ్ సెంటర్లో వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాజు ఆధ్వర్యంలో నిర్వ హించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం కరోన నిర్మూలనకు పనిచేయాల న్నారు. జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, ఎంపీఓ రాంప్రసాద్, ఏపీవో మాదవి, ఈసీ రాము, హెచ్ఈఓ సంపత్‌కుమార్, సర్పంచ్ సరోత్తం రెడ్డి పాల్గొన్నారు.