Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏసీరెడ్డినగర్ డబుల్బెడ్రూం
ఇండ్ల అభివృద్ధి కమిటీ సభ్యులు
మారబోయిన మల్లయ్య
నవతెలంగాణ-జనగామ
స్థానిక ఏసీరెడ్డినగర్ డబుల్ బెడ్ రూమ్లో విషసర్పాలు వచ్చి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పట్టించుకోకపో వడం దుర్మార్గమని సీపీఐ(ఎం) నాయ కులు, ఏసిరెడ్డినగర్ డబుల్బెడ్రూం ఇండ్ల అభివృద్ధి కమిటీ సభ్యులు మారబోయిన మల్లయ్య విమర్శించారు. జిల్లా కేంద్రంలోని భానుపురం ఏసీరెడ్డినగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు చేపట్టిన దీక్షలు సోమవారం 51వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా మల్లయ్య పాల్గొని దీక్షలు ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కోసం ఏసి రెడ్డినగర్ ఇండ్లను త్యాగం చేసిన కాలనీ అభివృద్దిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అడ్డుకుంటు న్నారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పగించి రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం, అధికారులు కనీస సౌకర్యాలైన మంచినీరు, కరెంటు,వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. కాలనీ వాసులపై రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా జిల్లా ప్రజలకు పరిపాలన చేరువచేయడం కోసం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి వారి ఇండ్ల స్థలాలను ఇచ్చిన త్యాగాన్ని గుర్తించి మౌలిక వసతులు కల్పించాల న్నారు. కరెంటు, వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం కల్పించకుంటే దీక్షలు ఇలాగే కొనసాగుతాయని హెచ్చరించారు. రాగల ఉమా, గుండె శాలిని, ఎల్లమ్మ, కోనేటి ప్రేమలత, సునిత, మౌనిక పాల్గొన్నారు.