Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈ నెల 24న నిర్వహించే స్కీమ్ వర్కర్ల దేశ వ్యాప్త సమ్మెలో ఆషా వర్కర్లందరు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, ఆషా యూనియన్ జిల్లా కార్యదర్శి మెట్టు కొండలక్షి పిలుపునిచ్చారు. సోమవారం సమ్మె నోటిస్ను డీఎంహెచ్ఓ కార్యాలయంలో వెంకటమ్మకు వినతిపత్రం అందజేసి వారు మాట్లాడారు. కార్మికులకు తక్షణమే ఉచిత సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపటాలన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి పంపిణీ చేపట్టి, నిర్ధారిత కాలపరిమితి లోపు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. కరోనా కట్టడికి ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందిని, స్కీం వర్కర్లకు రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో 6శాతం నిధులు కేటాయించాలన్నారు. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారిని నిరోధించడానికి ప్రజారోగ్య వ్యవస్థను, ఆరోగ్య మౌలిక వసతులైన హాస్పిటల్స్ బెడ్స్, ఆక్సిజన్, ఇతర వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు. వీలైనంత ఎక్కువ ఆరోగ్య సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ యేతర రోగులకు సమర్థవంతమైన చికిత్స అందించాలన్నారు. కోవిడ్ మృతుల కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. మొత్తం కుటుంబ సభ్యులకు కోవిడ్ చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. కోవిడ్ విధుల్లో ఉన్న స్కీం వర్కర్లకు అదనంగా నెలకు రిస్క్ అలవెన్సు కింద రూ.10వేలు చెల్లించాలన్నారు. పెండింగ వేతన, అలవెన్సులు చెల్లించాలని అన్నారు. విధులు నిర్వహిస్తుండగా కోవిడ్ సోకిన వారికి కనీసం రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని అన్నారు. స్కీం వర్కర్లను వర్కర్ కేటగిరీలో చేర్చాలని, ఐసీడీఎస్, ఎన్హెచ్ఎం, ఏఎన్ఎంలకు శాశ్వత బడ్జెట్ కేటాయిం పులు ఉండాలన్నారు. ఐసీడీఎస్, ఎండీఎంఎస్ లబ్దిదారులకు అదనపు రేషన్ అందించాలన్నారు. స్కీం వర్కర్ల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు 45, 46వ అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ల ప్రతిపాదనలు అమలుజేయాలన్నారు. నెలకు కనీసం రూ.21వేలు, పింఛను నెలకు రూ.10వేలు చెల్లించాలన్నారు. ఇతర అన్ని సౌకర్యాలు స్కీం వర్కర్లందరికీ అందజేయాలన్నారు. అధిక ధరలను ని యంత్రించాలని, ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 అందజేయాల న్నారు. ఆరోగ్య సర్వీసుల ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఆరోగ్య భద్రత హక్కు చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగలత కే రమ డి రమ, సంతోష, రాధిక పాల్గొన్నారు.