Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పార్టీ శ్రేణులు వారధిగా నిలవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా నియామకమైన ఏడు మండలాల మండల అధ్యక్షులు మాచర్ల గణేష్, భూక్య రమేష్ నాయక్, వారాల రమేష్, పల్లెపాటి జయపాల్ రెడ్డి, బస్వగాని శ్రీనివాస్, మునిగెల రాజు,మారిజే నర్సింహ రావును అభినందించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల చెంతకు చేర్చడంలో కార్యకర్తలు, నాయ కులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. పదవులు వరించినా, వరించక పోయినా నిరుత్సాహ పడకుండా పార్టీలో చురుకుగా పాల్గొనాలని అన్నారు. పదవులు పనితీరును బట్టి వరిస్తాయని, ప్రతీ కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్థానని భరోసా ఇచ్చారు.
మండల అధ్యక్షుడిగా మాచర్ల గణేష్
మండలంలోని థానేదార్పల్లి గ్రామానికి చెందిన మాచర్ల గణేష్‌ను టీఆర్ఎస్ నూతన మండల అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి మరింత కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, నెలమంచ అజరురెడ్డి, యూత్ నాయకులు మారేపల్లి ప్రసాద్, లకావత్ చిరంజీవి, గుండె మల్లేష్, ఆకారపు అశోక్, గాదె రాజు, తదితరులు పాల్గొన్నారు.