Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణా రెడ్డి
నవతెలంగాణ-రేగొండ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాగుబోతు అని, మంత్రి కేటీఆర్‌పై లేనిపోని ఆరోపణ లు చేసిన పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి బేషరతుగా ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం రేగొండ మండల కేంద్రంలో టీిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనుచితంగా మాట్లా డి అనంతరం క్షమాపణలు చెప్పి తప్పించు కోవడం ప్రతిపక్ష పార్టీల నాయకులకు అలవాటైపోయిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ను దేశంలోనే ముందు స్థానంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడం తగదన్నారు. నాయకుడనేవాడు ప్రజల మధ్య ఉంటేనే ప్రజల సమస్యలు తెలుస్తా యని అన్నారు. కార్యకర్తలు అందరూ తనకు సమానమే అని ఎవరిని చిన్నచూపు చూడ మన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని, రానున్న రోజుల్లో అందరికీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మండలస్థాయిలో రానివారికి జిల్లాస్థాయి లో, రాష్ట్రస్థాయిలో అవకాశాలు కల్పించేం దుకు కృషి చేస్తానన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశాలు ఉంటాయని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా వస్తుందన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. మండ లాన్ని రానున్న రోజుల్లో రెండు మండలాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రెండు మండల కమిటీలను వేస్తు న్నట్లు తెలిపారు. భూపాలపల్లి అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, ఎంపీపీ పున్నం లక్ష్మి, పీఏసీఎస్ చైర్మెన్ నడిపెల్లి విజ్ఞాన్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మోడెమ్ ఉమేష్‌గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దాసరి నారాయణ రెడ్డి, కొటంచా ఆలయ చైర్మెన్ హింగే మహేందర్, నాయ కులు అంకం రాజేందర్, కొల్గూరి రాజేశ్వర రావు, మైస బిక్షపతి, కెసి రెడ్డి ప్రతాపరెడ్డి, పట్టేం శంకర్, గంజి రజనీకాంత్, సర్పంచులు పాల్గొన్నారు.