Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యaఱ వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా సోమవారం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ల ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడారు. జర్నలిస్టుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అని అన్నారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నం అయిన ఇల్ల నిర్మాణం,స్థలాల కేటాయింపులు విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు.తీన్మార్ మల్లన్న పై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల కోరికలు నెరవేర్చాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు బొక్క దయాసాగర్,వల్లాల జగన్, చెన్న రామకష్ణ, వేణు, శ్రీనివాస్, సాగర్,రాజేందర్ ప్రమోద్ మధు, కిశోర్, కుమార్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.