Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనధికార వ్యక్తుల హల్చల్
ఇష్టానుసారంగా నిధుల వాడకం
నవతెలంగాణ-జనగామ రూరల్
మూడు దశాబ్ధాలుగా జనగామ కేంద్రంగా విలసిల్లిన దినదిన అభివృద్ధి చెందిన రుద్రమదేవి మహిళా మాక్స్ సొసైటీలో అంతా గందరగోళంగా మారిందని, పరిపాలన గాడితప్పి బైలా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని విచారణ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మహిళల్లో పొదుపును పెంపొందించాలనే ఏకైక ఉన్నత లక్ష్యంతో ఆవిర్భ విం న రుద్రమ్మదేవి సొసైటీలో అసలు లక్ష్యం అటకెక్కి చాలా కాలంమైందని అందరూ చర్చించుకుంటు న్నారు. 1994లో ఊపిరి పోసుకున్న మహిళా పొదుపు సంఘం నేడు 23,500 మంది సభ్యులతో 72 కోట్ల వార్షిక టర్నోవర్ దాటింది. జనగామ దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి, రఘునాథ్‌పల్లి, ఆలేరు తరిగొప్పుల బ్రాంచీలతో 15 క్లస్టర్లతో కొనసాగుతోంది. రఘునాథపల్లి బ్రాంచిలో మేనేజర్‌తోపాటు ఏడుగురు సూపర్వైజర్లు, జనగామ బ్రాంచీ అకౌంటెంట్ తోపాటు మేనేజరు తొమ్మిదిమంది సూపర్వైజర్లు, ఆలేరు బ్రాంచ్‌లో ఇన్చార్జ్ మేనేజర్‌తో పాటు నలుగురు సూపర్వైజర్లు, సింగరాజుపల్లి బ్రాంచీ ఇన్చార్జి మేనేజర్‌తోపాటు ముగ్గురు సూపర్వైజర్లు, తరిగొప్పుల బ్రాంచీ ఇన్చార్జి మేనేజర్‌తో పాటు నలుగురు సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నారు. సభ్యుల నుండి ఒక్కొక్క క్లస్టర్‌కు ఒక అధ్యక్షుని ఎన్నుకుంటారు. 15 మంది క్లస్టర్ అధ్యక్షులు బోర్డులో 15 మంది సభ్యులుగా ఉంటారు. పదిహేను మంది సభ్యుల్లో నుండి ఒకరిని మ్యాక్స్ సొసైటీ అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారు. సొసైటీలో పనిచేస్తున్న సిబ్బందిలో నుంచి సీనియర్ ఉద్యోగిని సొసైటీ సీఈఓగా బోర్డు తీర్మానం మేరకు నియమించుకుంటారు. సొసైటీ బైలా ప్రకారం సీనియార్టీ ప్రాతిపదికన ప్రమోషన్లు బదిలీలు చేయవచ్చు. కానీ, రుద్రమదేవి సొసైటీలో బైలా నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు జరుగుతున్నాయని చట్ట విరుద్ధంగా నియమించిన వ్యక్తులు ఇష్టానుసారంగా నిధులను పక్కదారి పట్టిస్తున్ననట్లు విచారణ చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై జనగామ బ్రాంచీలు అసిస్టెంట్ సూపర్వైజర్గా పనిచేస్తున్న ధర్మ కమల 2018 నవంబర్ 1న, మెడికల్ లీవ్ చెల్లింపుల విషయమై రఘునాథ్‌పల్లి బ్రాంచిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న బద్దిపడగ కల్పన 2018 నవంబర్ 9న అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి మద్దిలేటికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా అధికారి సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ ఒకరిని విచారణ అధికారిగా ఒకరిని అదే నెలలో నియమిం చారు. ఐదు నెలల పాటు సుదీర్ఘంగా రుద్రమదేవి ఆఫీసులో రికార్డులన్నింటినీ పరిశీ లించి విచారణ చేసిన రాధిక 2019 ఏప్రిల్ 27న పూర్తి నివేదికను జిల్లా సహకార అధికారి మద్దిలేటి సమర్పించారు. దాని ఆధారంగా అవినీతి అక్రమాలకు నిధుల దుర్వినియోగానికి పాలకవర్గం పాల్పడ్డట్లు గుర్తించారు. తన ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా 11 మంది ప్రతినిధులకు ప్రాథమికంగా 2019 నవంబర్ లో నోటీసులు జారీ చేశారు. అనధికారికంగా నియమింపబడ్డ వ్యక్తులు నిధులను పక్కదారి పట్టించినట్లు, సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు ఇచ్చినట్లు ఇలా అన్ని విషయాల్లో బైలా నిబంధనలు తుంగలో తొక్కినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇష్టానుసారంగా అవసరం లేని వాహనాలను కొనుగోలు చేసి ఆ తర్వాత అవసరం లేదని తీర్మానించుకున్నారు. లక్షలాది రూపాయల నష్టానికి వారి అనుచరులకు విక్రయించుకోవడం గమనార్హం. సొసైటీ సర్వసభ్య సమావేశాలు కూడా విస్మరించారు. పాలకవర్గం ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుండటంతో మహిళా సొసైటీ అసలు లక్ష్యం అటకెక్కుతోంది. కూలినాలి చేసుకునే మహిళలు పొదుపు చేస్తుండగా సొసైటీ ప్రతినిధుల నిర్వాకంతో ఆరు ఆందోళన చెందుతున్నారు. సహకార శాఖ జిల్లా కార్యాలయం నుండి వీరికి అండదండలు ఉన్నట్లు సొసైటీ ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూరుస్తూ ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి కూడా ధృవీకరించడం గమనార్హం.