Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకుల తప్పుడు విధానాలపై పోరాడాలి
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య
ఉత్సాహంగా పార్టీ మహాసభ
నవతెలంగాణ-గార్ల
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య అన్నారు. పాలకులు అవలంభిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని రాంపురం గ్రామంలో ఎల్లయ్య, రాజారావు, రమ అధ్యక్షవర్గంగా సోమవారం నిర్వహించిన పార్టీ 8వ మండల మహాసభకు జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌తోపాటు జి నాగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నల్లధనం వెలికితీత, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, తదితర వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ తదనంతరం హామీ లను విస్మరించిందని విమ ర్శించారు. ప్రపంచ మానవాళి మనుగడకు తీవ ముప్పు కలిగించిన కరోనాను కమ్యూనిస్టు పాలనలో ఉన్న చైనా సమర్థవంతంగా తిప్పికొట్టిందని, భారత్‌లో మోడీ చేతులు ఎత్తారని మండిపడ్డారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా లాక్డౌన్ ప్రకటించి కార్మికులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పెట్రోల్, డీజిల్, వంటనూనెల ధరలు ప్రస్తుతం చూస్తే పొంతనే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేను, ఇతర పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో దళిత బంధు అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ దాన్ని ఎన్నికల కోసం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకే దఫాలో అమలు చేయాలని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలివ్వాలని, ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని గిరిజన సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు గిరిజన యూనివర్శిటీని సాధించలేక పోయారని మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రాంపురంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు సమకూర్చలేక పోతున్నారని చెప్పారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలన్నారు. తొలుత గ్రామ పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించగా సీనియర్ నాయకుడు గుండా వెంకటరెడ్డి జెండా ఆవిష్కరించారు. అమరులకు పూలమాలలతో ఘనంగా నివాళ్లర్పించారు. మహాసభలో పార్టీ జిల్లా, మండల నాయకులు సూర్నపు సోమయ్య, శెట్టి వెంకన్న, రాజమౌళి, యూ శ్రీనివాస్, కందునూరి శ్రీనివాస్, గిరిప్రసాద్, కవిత, ఈశ్వర్ లింగం, వీరస్వామి, వెంకటేశ్వర్లు, గోవింద్, సత్యవతి, నాగమణి, ఉపేందర్‌రెడ్డి, హరి, వశ్యా, శివ తదితరులు పాల్గొన్నారు.