Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
మండలంలోని సూరవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని కొండాపురం ఇసుక ర్యాంప్‌కు సంబంధించిన గ్రామ సభ నిర్వాహణలో అధికారుల తీరు పై ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. రెండు వారాల క్రితం సూరవీడు పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామసభలో సాధారణ గ్రామసభ అంటూ రిజిస్టర్లో సంతకాలు సేకరించిన అధికారులు కొండాపురం ఇసుక వెలికితీతకు సంబంధించిన పీసా గ్రామ సభ అయ్యిందంటూ ప్రకటించడంతో సూరవీడు గ్రామానికి చెందిన కొందరు స్థానికమండల పరిషత్ అభివద్ధి అధికారి ఫణిచంద్రకు ఫిర్యాదు చేశారు. దాంతో గ్రామ సభను రద్దు చేసి అధికారులు తాజాగా సోమవారం సూరవీడు పంచాయతీలోని కే కొండాపురం పాఠశాల అధికారుల పీసా గ్రామ సభ నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. అయితే పాఠశాల నడుస్తున్న సమయంలో పాఠశాలలో లౌడ్ స్పీకర్లు, బాక్స్‌లు ఏర్పాటు చేశారు. దానికి తోడు ప్రస్తుతం కరోనా దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు పంపించాలంటేనే విధ్యార్థుల తల్లిదండ్రులు ఆందోళణకు గురౌతున్నారు. ఆలాంటి సమయంలో పాఠశాల నడుస్తున్న సమయంలోనే పాఠశాల సమీపంలో గ్రామ సభ నిర్వహించగా వందల సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. కనీసం గ్రామ సభలో కోవిడ్ నిబంధనలు సైతం పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎంపీఓ హాజరు కావడం కొసమెరుపు. పాఠశాల పీసా గ్రామ సభ నిర్వహించడంతో అధికారుల తీరుపై పలువురు బహిరంగంగానే మండిపడుతున్నారు.