Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీసుల సమీక్షా సమావేశంలో
సీపీ తరుణ్‌జోషి
నవతెలంగాణ-హసన్‌పర్తి
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని నగర పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి అన్నారు. మండల కేంద్రంలోని హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌ను నగర పోలీసు కమిషనర్ మంగళవారం అకస్మికంగా సందర్శించిచారు. పోలీసు స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి నేరాల నియంత్రణలో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై సమీక్షించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి వివిధ కేసుల్లో స్టేషన్ అవరణలో ఉన్న వాహనాలను తక్షణమే సంబందిత వాహన యజమానులకు వాహనాలు తీసుకపోవల్సిందిగా సూచిస్తూ నోటీసులు జారీచేయాల్సిందిగా కమిషనర్ అధికారులను అదేశించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చే బాదితులతో మర్యాదగా వ్రపర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్ సిబ్బంది పనితీరుపై అరా తీయడంతో స్టేషన్ టెక్ విభాగం, కోర్టు, స్టేషన్ రైటర్ల పనీతీరును పోలీస్ కమిషనర్ సంబందిత విభాగాల సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రస్తావించడంతో పాటు నేరాల నియంత్రణ, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ వర్టికల్స్ పనితీరుపై పోలీసు కమిషనర్ అడిగితెలుసుకున్నారు. మన పనితీరుపై పోలీస్‌శాఖ గౌరవ మర్యాదలు అధారపడి ఉంటాయన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాల ఎర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని, నేరాల నియంత్రణ కోసం సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా రెడ్డి, ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్‌రావు, ఎస్సైలు విజరుకుమార్, సాంబయ్య, ఏఎస్సైలు ప్రకాష్‌రెడ్డి, రైటర్లు వివేక్, సదానందం, అబీద్హుస్సేన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.