Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అయన చిత్రపటానికి అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో 22వ తేదీన ఇందిరా పార్కువద్ద ధర్నాను విజయవంతం చేయాలన్నారు. 27 న రైతు సంఘం దేశ వ్యాప్త బందుకు పిలుపునిచ్చిందన్నారు. 19 అఖిల పక్ష పార్టీ నాయకులు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు వాసుదేవరెడ్డి, సీపీఐ నాయకులు మేకల రవి, మరియు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడారు. న్యూ డెమోక్రసీ నాయకులు అప్పారావు, టీిజేఎస్ నాయకులూ ఎన్సీ శివాజీ, సంఘి ఎలేందర్, డీపీహెచ్‌ఎస్ జిల్లా ప్రెసిడెంట్, సీపీఐ నాయకులు తోట బిక్షపతి, బుస్స రవీందర్, కర్రే బిక్షపతి, సీపీఐ జిల్లా కార్యదర్శి, సీపీఐ(ఎం) నాయకులు జి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : పోచమ్మ మైదాన్‌లో మంగళవారం పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో కొండలక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. కుసుమ సతీష్, మూర్తి, గోరంట్ల రాజు, ఆనందం, వెంకటేశ్వర్లు, అశోక్,ధూర్జ్ఱెటి పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : కొండాలక్ష్మణ్ బాపూజీ వర్థింతిని సూరారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ బాపూజీ చేనేత సంఘం అధ్యక్షులు వేముల సమ్మయ్య, కార్యదర్శి గుండేటి రమేష్, ఎల్కతుర్తి మండల యూత్ అధ్యక్షులు గుండేటి సతీష, గ్రామ అధ్యక్షులు రాజు, సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.
శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి పదవిని త్యాగం చేసిన మహౌన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారా యణరావు అన్నారు. బాపూజీ తొమ్మిదవ వర్ధంతి పురస్కరించు కుని మండల కేంద్రంలోని ఎస్వికె కె ఫంక్షన్ హాల్లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. టీిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సెంటర్లో అఖిలపక్షం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగరి సాంబయ్య, దూదిపాల బుచ్చిరెడ్డి, చిందం రవి, కుమార స్వామి, రమేష్, బుజ్జి, మార్కండేయ, విద్యాసాగర్ పాల్గొన్నారు.