Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల సామాజిక ఆస్పత్రిలో రోగులను పట్టించుకోవడం లేదని, రోగుల పట్ల వైద్యలు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగుట్లా తిరుపతి అన్నారు. చిట్యాల సామాజిక ఆస్పత్రిని మంగళవారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఆస్పత్రిలో విద్యుత్తు జనరేటర్ సరిగా లేక గర్భిణుల్ని నాలుగు గంటల పాటు వేచి ఉంచి ఆపరేషన్ చేస్తామని వెళ్ళిపోయినా వైద్య సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినా వైద్య సిబ్బంది, విద్యుత్ సరఫరాను జనరేటర్, మంచినీటి సౌకర్యం కల్పించలేదనానరు. పారిశుధ్య పనులు ఎక్కడిదక్కడే నిలిచిపోయాయన్నారు. ఓ గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా విద్యుత్ లేదని పేర్కొంటూ చేరిన మరుసటి రోజు ఆపరేషన్ చేయ డం దారుణమన్నారు. గతంలో ప్రాణాలు కోల్పో యిన సంఘటనలున్నాయన్నారు. సిబ్బంది కూడా సమయపాలన పాటించట్లేదన్నారు. ఇదే విషయమై ఆరా తీస్తే కింది స్థాయి సిబ్బంది రోగులు, బంధువుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో 20 మంది విధులు నిర్వహించాల్సి ఉంది. జిల్లా వైద్య అధికారు లు, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడు నెలల నుండి ఆసుపత్రిలో జనరేటర్ పని చేయడం లేదని అధికారులకు ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోవట్లేదన్నారు. అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని పెత్తనం చేస్తూ రోగులను భయ బ్రాందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యం లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భానోత్ శ్రీనివాస్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర రఘు, నాగరాజు, నరేష్, రాకేష్ పాల్గొన్నారు.