Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
గణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి బురదమ యంగా మారింది. పాలకులు పట్టించుకోకపోవ డంతో కొన్ని నెలలుగా సమస్యలు తలెత్తుతున్నాయి. తహసీల్ధార్ కార్యాలయం వెళ్లే వారు కాకుండా ఆ రోడ్డు నుండి మోడల్ పాఠశాల, బీసీ హాస్టల్. కస్తూర్బా పాఠశాల, గోదాం ఉండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఆ రోడ్డు గుండా సైకిల్, ద్విచక్ర వాహనాలు, ఆటోలు కాలినడకన పాఠశాలకు వస్తుంటారు. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడం బురదమయంగా మారడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డు నుండి గోదాంకు లారీలు లోడ్‌తో వెళ్తుండడంతో రోడ్డు కుంగిపోయి గుంతలు ఏర్పడింది. ఉన్నతా ధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్య ను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.