Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి దాతలు పారితోష ికాలు అందజేస్తున్నట్లు ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండ లంలోని పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ప్రథమ సంవత్సరాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 150 మందికి మంగళవారం పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున నగదు పురస్కారం బహుమతులను శ్యాంసుందర్ రెడ్డి సతీమణి భాగ్యలక్ష్మి అందజేసారు. సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి తో ఎస్సై పాల్గొని మాట్లాడారు. శ్యాంసుందర్‌రెడ్డి స్మారకార్థం పారితోషికాలు అందించడం అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ చిట్టిరెడ్డి జంగారెడ్డి, ఆర్గనైజర్ చల్ల కిషన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవీందర్, సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.