Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
పోషణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆశాదేవి ఆధ్వర్యంలో 35వ డివిజన్ శివనగర్‌లోని ప్రభుత్వ పాఠశాల 9,10 వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆశాదేవి పాల్గొని మాట్లాడారు. బాలింతలు, గర్భిణులు పోషకాహారం తీసుకోవాలన్నారు. తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ హెల్త్ కో ఆర్డినేటర్ విశాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సైన్స్ ఉపాధ్యాయులు సునిత, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.