Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో సెంట్రల్ హెల్త్ టీం పర్యటించినట్టు డీఎంహెచ్ఓ డి శ్రీరామ్ తెలిపారు మంగళవారం డీఎంహెచ్ఓ ఛాంబర్లో సెంట్రల్ హెల్త్ టీమ్, ఢిల్లీ, జాయింట్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం గెడాం చంద్రశేఖర్, జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వైద్య ఆరోగ్య సేవలపై డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లకు వైద్య ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వైద్యాశాఖ లో సిబ్బంది, ఖాళీల వివరాలు నమోదు చేసుకున్నారు. గర్భిణులకు సేవలనిమిత్తం వాడుతున్న 102వాహనాలు, అవరాలపై అడిగి తెలుసుకున్నారు. జాతీయ కీటకజ నీత కార్యక్రమాల్లో మలేరియా కేసుల వివ రాలు, సమస్యాత్మక గ్రామాల గుర్తింపు, దోమతెరల పంపిణీ, ఐఎల్ఆర్ చేసిన గ్రామాల వివరాలు, మలేరియా కేసులు పెరగడానికి కారణాలు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు తదితరవి అడిగి తెలుసు కున్నారు.
జాతీయ కీటక జనీత కార్యక్రమా లపై రెండు రోజులపాటు సమీక్షిస్తామని వారు తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, డాక్టర ఉమాదేవి, మమ తాదేవి, గోపీనాథ్, డీపీహెచ్ఎన్ఓ వెంకటమ్మ, మాస్ మీడియా ఆఫీసర్ అన్వర్, ఎన్హెచ్ఎం చిరంజీవి, శ్రీనివాస్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ భాను పాల్గొన్నారు.