Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని నియో జకవర్గ గ్రామ కమిటీలను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభినందనలు తెలిపారు. హనుమ కొండ జిల్లా కెఎస్ఆర్ గార్డెన్లో మంగళ వారం పరకాల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధి పరకాల, నడికూడ, గీసుగొండ, ఆత్మకూరు, దామెర, సంగెం మండల కమి టీలను ఎన్నుకున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఎస్ఈఎస్ఐ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు. జెడ్పీ చైర్మెన్ ఎం సుధీర్ బాబు, సీనియర్ నాయకులు ఏ బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అందరూ పార్టీ నిర్ణయా లకు కట్టుబడి పనిచేయాలని పార్టీ పదవులు ఆశించి భంగపడ్డ వారు నిరాశ చెందవద్దని అన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం మన్నారు. కార్యకర్త అకాల మరణం చెందితే కుటుంబానికి రెండు లక్షల ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏదో రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందని కడప లేదని అన్నారు. సాహసోపేత నిర్ణయాలతో ముందుకెళ్తున్న ఘనత టీిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నా రు. 70 ఏండ్లుగా కుంటుపడిన అభివృద్ధిని ఏడేండ్లలో చేసి చూపిన ఘనత మన కేసీఆర్‌దేనని అన్నారు. షాదీ ముబారక్. దళిత బంధు, కల్యాణలక్ష్మి. రైతు బంధు. రైతు బీమా, తదితర పథకాలతో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి రాష్ట్రంలో జరిగిందని అన్నారు. అదే స్ఫూర్తితో మండల కమిటీల ను ఎన్నుకోవాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో దామెర మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షుడిగా గండు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ముదిగొండ కృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, పీఏసీఎస్ చైర్మెన్ బొల్లు రాజు, ఎంపీటీసీలు సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.