Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
నేటి నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో మంగళవారం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మావోయిస్టులపై నిఘా పెట్టామన్నారు. గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని అన్నారు. ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్ట పరుస్తూ టార్గెట్‌ను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. కాలేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ టి కిరణ్, కాళేశ్వరం ఎస్సై ప్రసన్నకుమార్, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మండలంలో ఎస్సై వీరభద్రరావు ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. జూకల్ క్రాస్‌రోడ్డు, చల్లగరిగ గ్రామ సమీపంలో రోడ్డుపై వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీలకు వాహనదారులు, ప్రజలు సహకరించాలన్నారు.