Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
విద్యార్థులకు రూ. 50వేల విలువజేసే నోట్ బుక్స్, మాస్కులు, పెన్నులు అందజేసి యువ శాస్త్రవేత్త తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మండలంలోని గురిజాల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పాఠశాల ప్రధానో పాధ్యాయులు గుడిపూడి రాంచందర్రావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ డీఆర్డీవోలో పనిచేస్తున్న యువ శాస్త్రవేత్త దౌడు రాంబాబు 1997-98 10వ తరగతి బ్యాచ్ మిత్రులతో కలిసి రూ.50 వేల విలువైన నోటీబుక్స్, మాస్కులు, పెన్నులు,పెన్సిళ్లు విద్యార్థులకు అందించారు. ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ సరిత, ఎంపీటీసీ బండారి శ్రీలత రమేష్, ఎస్ఎంసీ చైర్మెన్లు మడిపెద్ది రాములు, పర్స నరసింహ స్వామి, రిటైర్డ్ ఎస్సై నర్సయ్య, బ్యాచ్ సభ్యులు ముదురు రాజు, మరాఠీ రవి, డ్యాక రవి, గర్నెపెళ్లి శ్రీనివాస్, డక్క సంపత్,మర్రి రాంబాబు, దౌడు సంపత్, యెడ రమేష్, శ్రీను, మధుకర్, యకాంభ్రం, శ్రవణ్, శ్రీను, యకయ్య, శ్రీను, కుమారస్వామి, రమేష్ పాల్గొన్నారు.