Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఎస్సై ఉదరుకిరణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. లేదంటే డయల్100కు సమాచారమివ్వాలని అన్నారు. బాల్యవివాహాలు, వాటి వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. మహిళల్ని ఇబ్బందులు పెడితే అమలుజేసే శిక్షలపై వివరించారు. అనంతరం బాల్య వివాహాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుమన్, కళాశాల షీ టీం ఇన్చార్జి స్వాతి మసూద్, తదితరులు పాల్గొన్నారు.
వాహనాలను ఎస్సై తనిఖీ
మండలంలోని బుర్రకథగూడెంలో ఎస్సై ఉదరు కిరణ్ మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారుల లైసెన్స్తోపాటు వాహన పత్రాలు పరిశీలించారు. హెల్మెట్, వాహన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. మావో యిస్టు వారోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని పరిశీలించారు.