Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్-2021 లో నగరాన్ని అగ్రగామిగా నిలపాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం బల్ధియా ప్రధాన కార్యాలయంలో మేయర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, అధికారులు, సఫాయి మిత్ర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... 10 లక్షల జనాభా కేటగిరి విభాగంలో వరంగల్ 72 నగరాలతో పోటీపడనున్నదని, ప్రస్తుతం ప్రధమ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఆయా డివిజన్ ల కార్పొరేటర్ ల సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 30 లోగా ప్రజాభిప్రాయాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మానవ వ్యర్థాలను పీపీఈ పద్దతులు పాటిస్తూ యంత్రాల ద్వారా సేకరించి అమ్మవారి పేటలోని మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రానికి తరలించాలన్నారు. అక్కడ ఎరువుగా మార్చబడుతుందన్నారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తత ప్రచారం కల్పిస్తామని అన్నారు. సఫాయి మిత్ర సిబ్బందికి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ కొనుగోలు ధ్రువ పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి ఎస్ఈ శ్రీనివాసరావు, కెనరా బ్యాంక్ మేనేజర్ దీక్ష, ఈఈ లక్ష్మారెడ్డి, సానిటరీ సూపర్ వైజర్లు సాంబయ్య, భాస్కర్, నరేందర్, ఆస్కి ప్రతినిధులు రాజ్ మోహన్‌రెడ్డి, అవినాష్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డ్ ను సందర్శన
కాజీపేట : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధి మడికొండ ,రాంపూర్ గ్రామాల మధ్యలోఉన్న డంపింగ్ యార్డును మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య సందర్శించారు. గతంలో ఎర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌తో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, సమస్య కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ వారికి వివరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. స్పందించిన వారు మాట్లాడుతూ... బయో మైనింగ్ , డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు మంత్రి కేటీఆర్రూ.28 కోట్లతో శంకుస్థాపన చేశారని, కార్యచరణ ప్రారంభమైందని తెలిపారు. గుత్తేదారు రంజిత్‌రెడ్డి త్వరలోనే పనులు చేపడతారని సమస్య పరిష్కరించబడుతుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌జిల్లా నాయకులు కుందూరు రాజేష్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ దువ్వ శ్రీకాంత్, మాజీ మెట్టుగుట్ట చైర్మన్ అల్లం శ్రీనివాస్ రావు, దువ్వ నవీన్, బోల్లికొండ వినోద్‌కుమార్, నర్మెట బిక్షపతి గాండ్ల, ఈగ శ్రీధర్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..