Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించి ఆదుకుంటుందని వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయం లోని ఐకేపీ సమావేశ మందిరంలో మంగళవారం మండల సమాఖ్య 17 వ వార్షిక మహాసభ ఏపీఎం శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి పాల్గొని మాటాడారు. మహిళా సంఘం సమావేశాలు సక్రమంగా నిర్వహిస్తూ సంఘాలను పటిష్టపరచడంలో లీడర్లే ముఖ్య పాత్ర పోషించాలన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలను సంఘం మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. గతంలో రుణాలు తక్కువగా ఇచ్చారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ రుణాలు ఇస్తున్నదని అన్నారు. కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళలకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం శాయంపేట గ్రామానికి చెందిన కూరాకుల మంజులకు వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.లక్ష25 వేల విలువైన ఎల్ఓసీని మంగళవారం బాదిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఎం అనిల్‌కుమార్, ఏపీఎం కోటేశ్వర్, సమాఖ్య అధ్యక్షురాలు రమాదేవి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, సీసీలు విజరు, కేదారి, జ్యోతి, ఎంపీటీసీ బాసని చంద్రప్రకాష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి, సర్పంచ్ కందగట్ల రవి, ఎంపీటీసీ చంద్రప్రకాష్ పాల్గొన్నారు.