Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా నిబంధనలు పాటించాలి
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-కాజీపేట
దేశ, విదేశాల నుంచి సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గా ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాదిమంది సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపడతామని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ అన్నారు. దర్గా కాజీపేటలోని సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గాలో అక్టోబర్ 4,5,6 తేదీల్లో జరగనున్న దర్గా ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం, దర్గా పీఠాధిపతి కుశ్రుపాషా నివాసంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చెర్మెన్ మర్రి యాదవరెడ్డి, పోలిస్ కమిషనర్ తరుణ్ జోషి, కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, ఆర్డీఓ వాసుచంద్ర, అధికార యంత్రాంగంతో కలిసి ఆయన దర్గా పరిసర ప్రాంతం పరిశీలించారు. పీఠాధిపతి కుశ్రుపాషాను సమస్యలు, కావాల్సిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల ఉన్నతాది óకారులు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కుశ్రుపాషా నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో చీఫ్‌విప్ మాట్లాడారు. దేశంలోనే పేరెన్నిక కలిగిన బియాబాని ఉర్సు దర్గా ఉత్సవా లకు వచ్చే సందర్శకులకు ప్రజలు సహకరించాలని కోరారు. దర్గాలోని ప్రభుత్వ పాఠశాలకు మూడు రోజుల పాటు సెలవులు ఇప్పించి వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు వచ్చే వారికోసం పార్కింగ్, ఇతర సౌకర్యాలు, వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే పీఠాధిపతులకు ప్రత్యేక రవాణా మార్గం ఏర్పాటు చేయిస్తా నని హామీనిచ్చారు. ఉర్సు ఉత్సవాలలో ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మెడికల్ శాఖ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాజిపేట దర్గా ఉర్సు ఉత్సవాలను విజయ వంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పుష్ప, అదనపు డీసీపీ జనార్ధన్, తహసీల్ధార్ కిరణ్ కుమార్, యువ పీఠాధిపతి భక్తియార్ బాబా, 48వ డివిజన్ కార్పొరేటర్ షార్తాజ్ బేగం, మాజీ కార్పొరేటర్ అబూబకర్, డివిజన్ అధ్యక్షులు కునుమల్ల హరినాథ్, టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్‌నాథ్, కుమార్, రమేష్, శ్రీనివాస్, సాయిబాబా, రాజు, తదితరులు పాల్గొన్నారు.