Authorization
Mon Jan 19, 2015 06:51 pm
27న బంద్‌ను జయప్రదం చేయాలి
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య
నవతెలంగాణ-జనగామ
ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ంలోని బీజేపీని గద్దె దించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య పిలుపునిచ్చారు. పాలకుల తప్పుడు విధానాలను నిరసిస్తూ ఈనెల 27న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాల ని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో నాగయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించేలా మూడో చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. వాటిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు 10 నెలలుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు ఏ పంటలు పండించాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను సదరు నల్ల చట్టాల కొల్లగొడతాయని చెప్పారు. అలాగే లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ప్రజలు అన్నదాతలకు అండగా నిలుస్తారని చెప్పారు. ఈనెల 27న తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, రాపర్తి సోమన్న, సింగారపు రమేష్, పోత్కనూరి ఉపేందర్, రామావత్ మీట్యానాయక్, సాంబరాజు యాదగిరి, సోమ సత్యం, బోట్ల శేఖర్, నాగరాజు పాల్గొన్నారు.