Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
లావాదేవీల డిజిటలైజేషన్ ద్వారా సభ్యులకు సమాచారం అందుబాటులో ఉంటుందని సెర్ప్ డైరెక్టర్ వై నర్సింహారెడ్డి అన్నారు. మహిళా సంఘాల్లో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించుటకు కొత్త విధాన ప్రక్రియ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కాట్రపల్లి పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మదర్ థెరిసా, భద్రకాళి గ్రామ మహిళా సంఘాల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఆర్థిక లావాదేవీలు సభ్యులందరికీ అందుబాటులో ఉండేవి కావని, డిజిటలైజేషన్తో ఆ సమస్య తీరిందన్నారు. మహిళా సంఘాల లావాదేవీలు అంతర్జాలం అందు బాటులో ఉండటం వలన సభ్యులు ఎక్కడినుండైన ఆర్థిక లావాదేవీలు చేసుకునే వీలుంటుందని తెలిపారు.
ఎంపీపీ కళావతి మాట్లాడుతూ.. అంతర్జాలంలో నమోదు ప్రకియ ద్వారా సభ్యులు వారి వివరాలను సెల్ఫోన్లో చూసుకునే వెసులుబాటు కలుగు తుందన్నారు. డీఆర్డీఓ సంపత్ రావు మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా సెర్ప్ ఎస్హెచ్జీలు, వీఓలు సాంకేతికతను అందిపుచ్చుకుని సమిష్టిగా ముందడుగు వేయాలన్నారు. నైపుణ్యాలను అభివద్ధి చేసుకొనుటకు డీఆర్డీఓ నుంచి గానీ, ఇతర సంస్థల నుంచి గానీ శిక్షణ తీసుకొని జీవనోపాదులు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, సర్పంచ్ సాగర్ రెడ్డి, ఎంపీటీసీ ప్రసునా, డీపీఎంలు దయాకర్, అనిత, ఏపీఎం కిషన్, సీసీలు స్వరూపరాణి, రాజయ్య, సురేశ్, కుమారస్వామి, ఏలీయా, కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.