Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఉత్తమ సమాజ నిర్మాణ కోసం ఎన్సీసీ కాడెట్ల శిక్షణ ఎంతో అవసరమని వరంగల్ ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ హరీష్ దుబే అన్నారు. ఇటివల గ్రూప్ కమాండర్‌గా బాధ్యతలను స్వీకరించిన కల్నల్ హరీషన్ దబేను నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బీ.చంద్రమౌళి మార్యద పూర్వకంగా కలుసుకొని పుష్ప గుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా కల్నల్ హరీష్ దుబే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎన్సీసీ శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఎన్సీసీ ద్వారా ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఉత్తర భారత దేశంలో చాల మంది విద్యార్థులు ఎన్సీసీలో ప్రవేశించి శిక్షణ సర్టిఫికెట్లతో ఇండియన్ ఆర్మీలో చేరుతున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా నుంచి కూడా విద్యార్థులు ఎన్సీసీలో చేరేందుకు ఆసక్తి చూపాలన్నారు. డిగ్రీ స్థాయిలో ఎన్సీసీని ఒక ఆప్షనల్ సబెక్టుగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్మీలో ప్రవేశం కోసం గ్రామీణ ప్రాంత యువత ముందుకు రావాలన్నారు. జిల్లాకు సంబంధించి ప్రత్యేక యూనిట్ కలిగిన నర్సంపేట డిగ్రీ కళాశాలలో చేరి తగు శిక్షణ తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ చంద్రమౌళి ఎన్సీసీ మహిళా విభాగం చేస్తున్న శిక్షణ, ఇతర యాక్టివిటీస్‌ను ఆయనకు వివరించారు. బాలుర ఎన్సీసీ విభాగం కూడా మంజూరు చేయాలని కోరారు. ఇందుకు కల్నల్ దుబే సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.