Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ఏటూరునాగారం (టౌన్)
ఆధునాతన వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో గురువారం అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కమిటీతో కలెక్టర్ కష్ణ ఆదిత్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ ఆధారిత పంటలు వరి, మిరప, పల్లి తదితర పంటల గురించి వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ లో వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ మత్స్యశాఖ ద్వారా రైతులకు ఉపయోగ పడే ప్రభుత్వ పథకాల ను అర్హత మేరకు రైతులకు అందే లా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అధునాతన సాంకేతిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం ఆర్జించే విధం గా వ్యవసాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఆదాయ మార్గాలు ఇచ్చే అనేక పథకాలు ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందని, తద్వారా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఆత్మలో ఉన్న నిధులను ఉపయోగించి మారుమూల గిరిజన గ్రామాలను గుర్తించి వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా మేడారం, పంబాపుర్, నర్సాపూర్లలో ప్రతి ఇంటికి 45 కోడి పిల్లల పెంపకం పథకాన్ని మంజూరు చేయాలనీ సంబంధిత అధికారిని ఆదేశించారు.
చేప పిల్లల పెంపకానికి ఫిష్ ఫాండ్ నిర్మాణానికి ఉత్సాహ వంతులైన ఆదర్శ రైతులను ఎంపిక చేసి ఫిష్ పాంట్స్ ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు మండలాల వారిగా ముందస్తు టూర్ డైరీ రూపొందించి నివేదికల ఆధారంగా ఫీల్డ్ విజిట్ చేయాలని పేర్కొన్నారు. సారవంతమైన భూమికి నీటి సౌకర్యానికి అనుగుణంగా ఉన్న పంటలపై రైతులు మొగ్గు చూపే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఏఈఓలు క్షేత్రస్థాయి పర్యటనలు అటెండెన్స్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని, వారానికొకసారి గ్రామాలను పర్యటిస్తూ ప్రతి సమాచారాన్ని వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. మండలాలలో వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించినప్పుడు ఆత్మ సభ్యులను తప్పనిసరిగా పిలవాలని, వారిని సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇద్దరు ఆదర్శ రైతులు రావుల సునీత, కుమ్మరి తిరుపతయ్య లకు 10 వేల రూపాయల చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, ఫిషరీస్ ఏడీ వీరన్న, వెటర్నరీ అధికారి విజరు భాస్కర్, అత్మ చైర్మన్ దుర్గం రమణ, శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.