Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నవతెలంగాణ-నల్లబెల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పా లని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. గురువారం ఆసరవెల్లిలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అధ్యక్షతన గ్రామంలోని 70కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పభు త్వం చేతగానితనం, అనాలోచిత విధానాలతో సామాన్యుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే పోడు భూములకు పట్టాలిప్పిస్తామన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవు తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, బానోతు లక్ష్మణ్, మేడపల్లి ఎంపీటీసీ మాలోత్ అంజలి మోహన్, ఎర్రబెల్లి రఘుపతి, చర్ల శివారెడ్డి, జ్యోతి, అశోక్, చరణ్ సింగ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.