Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-పరకాల/ఆత్మకూర్
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలోని పలువురికి 5లక్షల, 35వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆత్మకూర్ మండలానికి చెందిన బాధితులకు రూ. 16వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించు కున్న వారందరికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం చేసి అండగా ఉన్నామన్నారు. పేదింటి కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్ర మంలో పరకాల వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గూడెప్పాడ్ ఏఎంసీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంబటి రాజస్వామి, రజినీకర్ గౌడ్ పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత .
సంగెం : వెంకటాపూర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న తాళ్లపెల్లి విజయ భర్తకు గురువారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన నివాసంలో రూ.లు 2లక్షల ఎల్ఓసీని అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, మండల పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షులు పసునూరి సారంగపాణి, కార్యదర్శి మల్లయ్య, నాయకుడు పూజారి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.