Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలల సంక్షేమ సమితి జిల్లా చైర్పర్సన్ వసుధ
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఆరోగ్యవంతమైన బాల్యంతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది వేయాలని బాలల సంక్షేమ సమితి ములుగు జిల్లా చైర్పర్సన్ వసుధ అన్నారు. గురువారం పస్రాలో సీడీపీఓ మల్లీశ్వరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ములుగును ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా బాలలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరగకుండా, బాలలు కార్మికులుగా పనిచేయకుండా చూడాలన్నారు. అధికార యత్రాంగం బాలల హక్కులు ఉల్లంఘన జరగకుండా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీడీపీఓ మల్లేశ్వరి మాట్లాడుతూ.. ప్రాజెక్ట పరిధిలోని గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని ఐసీడీఎస్, డీసీపీయూ, చైల్డ్ లైన్, సఖి సిబ్బందితో ప్రతి సెక్టార్ మీటింగ్లో అంగన్వాడి టీచర్లు బాలల చట్టాలు, హక్కులు, సమస్యలు, వారికి అందించాల్సిన సేవలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహిసున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బాల రక్ష భవన్ కో-ఆర్డినేటర్ కే.స్వాతి, సీడబ్ల్యూసీ సభ్యులు షాహిద్ ఆ బేగం, బండ రామలీల, జిల్లా బాలల సంరక్షణ అధికారి జే ఓంకార్, స్థానిక అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.