Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాలి
మంత్రి దయాకర్‌రావు
నవతెలంగాణ-హసన్‌పర్తి
సీఎం కేసీఆర్ పాలనలో కుల వృత్తులకు పూర్వవైభవం సంతరించు కున్నాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక పెద్ద చెరువులో మత్స్య శాఖ ద్వారా పంపిణీ చేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్డీఓ వాసుచంద్ర, మత్స్యశాఖ అధికారి భారతిలతో కలిసి ఆయన గురువారం వదిలారు. అనంతరం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చెరువులో చేపలు పట్టే హక్కు ఇక ముదిరాజ్ బిడ్డలదేనన్నారు. సమైక్య రాష్ట్రంలో మత్స్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఇప్పుడు మత్య్సకారుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉన్నారని తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివద్ధి సాధించి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశామని తెలిపారు. మత్స్య సంపదను రక్షించుకుని మత్స్యకారులు అభివద్ధి చెందాలన్నారు. వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ముదిరాజ్ బిడ్డలు అన్ని రంగాల్లో ఎదగడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ రాజీవ్గాంధీహనుమంతు మాట్లాడుతూ.. చేప పిల్లలు పంపిణీ, ప్రగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునితరాజు, జెడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ఆర్డీఓ వాసుచంద్ర, తహశీల్దారు బండి నాగేశ్వర్రావు, ఏపీడీ శ్రీవాణి, మిషన్ భగీరథ ఏఈ ఆమ్జా, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు బండి రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి పీహెచ్సీలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరురి రమేష్, కలెక్టర్ రాజీవ్గాంధీహనుమంతుతో కలసి కోవిడ్ ప్రచార వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లాకు 12 కోవిడ్ వాహనాలు అందించడం పట్ల సంస్థ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెఓలు డాక్టర్ మదన్ మోహన్, డాక్టర్ యాకుబ్‌పాష, డాక్టర్లు కష్ణారావు, మల్లి కార్జున్రావు, గీతాలక్ష్మీ, ఉమశ్రీ, వాణిశ్రీ, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలు కేటాయింపులో అన్ని వర్గాలకు రిజర్వేషన్
రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపులో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్ ద్వారా అవకాశం కల్పించడం హర్షణీయమని మంత్రి దయాకర్‌రావు, వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. స్థానిక ఎల్లమ్మగుడి వద్ద గౌడ కులస్తులతో కలిసి వారూ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ పాపిశెట్టి శ్రీధర్, జై గౌడ్ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు చిర్ర సుమన్‌గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు, వల్లాల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.