Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీసీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్
కేంద్రాల ఎదుట ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలోని ఈసేవ, మీసేవ కేంద్రాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వినియోగదారుల ఫోరం (టీసీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఈసేవ, మీసేవ కేంద్రాల ఎదుట ఫోరమ్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఫోరమ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుడుదుల వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఈసేవ, మీసేవ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈసేవ, మీసేవ కేంద్రాలు పని చేయడం లేదన్నారు. ప్రభుత్వ అధికారులు పర్సంటేజీలకు ఆశపడి అనుభవం లేని వారికి ఈసేవ, మీసేవ కేంద్రాల లైసెన్సులు జారీ చేస్తున్నారని విమర్శించారు. కేంద్రాల్లో ధరల పటికను ప్రదర్శించడం లేదని, ఇతర నిబంధనలు పాటించడం లేదని చెప్పారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. అవినీతికి పాల్పడుతున్న నిర్వాహకుల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజ్‌కుమార్, గడ్డం సజన, ఉపాధ్యక్షుడు రమేష్, కోశాధికారి లావణ్య గౌడ్, రవికాంత్, కార్తీక్, నాంపల్లి దేవరాజ్, రమేష్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.