Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
మండలంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని పార్టీ మండల అధ్యక్షులు ధర్మారపు వేణు కోరారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని శాఖల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. మండల అధ్యక్షుడుగా ధర్మారపు వేణు, మండల ఉపాధ్యక్షుడుగా పొన్నాల ఉమేష్‌రెడ్డి, అంకం సోమేశ్వర్, మల్లం లింగయ్య, మండల ప్రధాన కార్యదర్శి గుండగాని యాకయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా తుమ్మ సత్యనారాయణ, ఎర్రం వెంకట్రాములు, బర్మావత్ కీమా, సంయుక్త కార్యదర్శులుగా రొయ్యల అశోక్, కొంపల్లి రవి, రూపిరెడ్డి సంజీవరెడ్డి, ప్రచార కార్యదర్శులుగా ఉప్పల కష్ణ, ఆవుల లింగయ్య, నట్టి కళావతి, కోశాధికారిగా వీరగాని రమేష్, యూత్ కమిటీ మండల అధ్యక్షుడుగా వీరబోయిన కిషోర్, ఉపాధ్యక్షులుగా అనపర్తి వీరన్న, గుగులోత్ యుగేందర్, దుబ్బాకుల ఆవిలయ్య, కార్యదర్శిగా కొండ లింగమల్లు, బీసీ సెల్ మండల అధ్యక్షుడుగా పొన్నోటి బాలాజీ, ఉపాధ్యక్షులుగా బండి నర్సయ్య, మల్లం రవి, కార్యదర్శిగా పులుసు చంద్రమౌళి, రైతు కమిటీ మండల అధ్యక్షుడుగా మద్దుల సుధాకర్‌రెడ్డి, కార్యదర్శిగా కొమ్మినేని వెంకట్రాంనర్సయ్య,మహిళ కమిటీ మండల అధ్యక్షురాలు కురబోయిన గీర్వాణి, కార్యదర్శిగా ఈదురు జయమ్మ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మద్దిరాల వీరస్వామి, కార్యదర్శి మద్దిరాల రమేష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గుగులోత్ పోటీయా, కార్యదర్శి జర్పుల సురేందర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు చిల్ల రామకృష్ణ, మల్లం ప్రవీణ్, మల్లెపాక మధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ సంపేట రాముగౌడ్,ఓలాద్రి మల్లారెడ్డి,సర్పంచులు అల్లం కష్ణ, నాగయ్య,తండా రాములు తదితరులు పాల్గొన్నారు.