Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గంగారం
జిల్లా కలెక్టర్ శశాంక జిల్లాలోని మారుమూలై పల్లెలో గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఏజెన్సీ పరిధిలోని గంగారం మండలం లోని కోమట్లగూడెం గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామం లోని పీహెచ్సీకి చేరుకుని రిజిస్టర్ ను తనిఖీ చేశారు. వైద్యులు సకా లంలో రోగులకు అందుబాటులో ఉండాలని, ఆరోగ్య కేంద్రాన్ని శుభ్రంగా ఉంచాలని, తదితర పలు సూచనలు అందించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. 18 ఏండ్లకుపైబడ్డ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. వద్ధులకు తప్పనిసరిగా ఇంటికి వెళ్లి వాక్సిన్ వేయాలని సిబ్బందికి చెప్పారు. జెడ్పీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. అనంతరం తిరుమలగండిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించి పరిశీలించారు. నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన ఆరోగ్య కార్యకర్తలు నాగలక్ష్మి, శ్రీలత, సుజాతలతోపాటు వైద్యులను అభినందించారు. వారితోపాటు ప్రజాప్రతినిధులను కలెక్టర్ శాలువా కప్పి సన్మానించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు దిలీప్ కుమార్, తహసీల్దార్ సూర్యనారాయణ, ఎంపీడీఓ శ్యామ్, జెడ్పీటీసీలు ఈసం రమ, ఎంపీపీ సరోజన, వైద్యాధికారి హరీష్ రాజ్, ఉపవైద్యాధికారి అంబరీష్, కోమట్లగూడం గంగారం వైద్యాధికారులు ముఖ్రమ్, అఫ్రోజ్, సాయినాథ్, కొత్తగూడ ఎస్సై సురేష్ నాయక్, తదితరులున్నారు.