Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-కేయూ క్యాంపస్
కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతనాలు పెంచాలని యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కుమార్ లొధ్ అన్నారు. కేయూ క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రికి గురువారం ఆయన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వేతనాలు పెరిగాయని, కానీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మాత్రమే వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందరికీ యూజీసీ సెవెంత్పే 67,509 రూపాయలు ఇస్తూ ప్రతి సంవత్సరం మూడు శాతం క్యుములేటివ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని తెలిపారు. నెట్, సెట్ ఉండి పీహెచ్డీ ఉన్నవాళ్లకు నెలకు ఐదువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కరుణాకర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.నాగయ్య, కోశాధికారి డాక్టర్ సతీష్, డాక్టర్ నిరంజన్, డాక్టర్ ఫిరోజ్ పాష తదితరులు పాల్గొన్నారు.