Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపోహలొద్దు : సర్పంచ్ గౌరమ్మ
నవతెలంగాణ-తాడ్వాయి
18 ఏండ్లకుపైబడ్డ అందరూ కరోనా నిరోధక టీకా వేయించుకోవాలని కాటాపూర్ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ కోరారు. మండలంలోని కాటాపూర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో హెల్త్ సూపర్వైజర్ ఖలీల్, ఏఎన్ఎం గంగ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌరమ్మ మాట్లాడారు. గ్రామంలో 99.5 వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు. మిగతా ప్రజలకు టీకా వేయించి నూరు శాతం పూర్తి చేశామన్నారు. తద్వారా పంచాయతీ ఆదర్శవంతంగా నిలిచిందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని తెలిపారు. వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెంది కరోనా వైరస్ను శరీరంలోకి ప్రవేశకుండా అడ్డుకుంటాయని చెప్పారు. గ్రామంలోని ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రం, కారోబార్ షేక్ హుస్సేన్, ఆశ వర్కర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.