Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
నేటి భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. బంద్‌కు సంఘీభావంగా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, నూతన విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, సీపీ ఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్, డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మాధవ్, పెన్షనర్ల సంఘం నాయకుడు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష పార్టీల ద్విచక్ర వాహన ర్యాలీ
అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు ఆకుల రాజు, అజరు, మండల వెంకన్న, గౌని ఐలయ్య, చిన్న చంద్రన్న, హరినాయక్, జగనన్న మాట్లాడారు. బంద్‌లో అన్ని తరగతుల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య, సమ్మెట రాజమౌళి, అఖిలపక్ష పార్టీల నాయకులు నిరుటి సురేష్, ఇరుగు మనోజ్, రేచపల్లి నవీన్, పెరుగు కుమార్, లింగానాయక్, హేమానాయక్, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ఎండగట్టారు. ర్యాలీలో సీపీఐ(ఎం) నాయకులు చిట్టిబాబు, ఆదిరెడ్డి, నాగరాజు, రాజేష్, మురళీ, ఆగిరెడ్డి, శ్రీను, రామ స్వామి, కరుణాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రసపూత్ సీతారాం నాయక్, దాసరి సుధాకర్, జంపాల ప్రభాకర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మీజోగానాయక్, భూక్య సుక్య, ముద్దబోయిన రాము, ఉపసర్పంచ్లు బద్దం లింగారెడ్డి, కట్ల జనార్ధన్‌రెడ్డి, టీడీపీ నాయకులు సురవరపు వెంకట్రామయ్య, జంపాల సత్యనారాయణ, నర్రా శివాజీ, ఈర్ల పాపులు, తదితరులు పాల్గొన్నారు.
వాజేడు : మండల కేంద్రంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్‌రావు మాట్లాడారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) నాయకుడు దబ్బకట్ల లక్ష్మయ్య, సీపీఐ నాయకులు ఆచంట ప్రసాద్, నల్లెబోయిన రవీందర్, సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు దాట్ల వాసుబాబు, కాకర్లపూడి విక్రాంత్ బాబు, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జగన్ రాజు, ఖాజావలీ, పాయం రామదాసు, టీడీపీ నాయకులు వత్సవాయి రమేష్‌బాబు, టీజేఎస్ నాయకుడు దబ్బకట్ల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు కందునూరి శ్రీనివాస్, సక్రు, రామారావు, సత్యనారాయణ, కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కష్ణ గౌడ్, రమేష్, అయోధ్య, కోటి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.