Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, తెలంగాణ ఉద్యమ పోరాటానికి స్ఫూర్తి వీరనారి చాకలి ఐలమ్మని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా హంటర్ రోడ్డు శాయంపేట లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, చీఫ్ విప్ వినరుభాస్కర్, మేయర్ గుండు సుధారాణిలు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాష్, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్, జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, బీ గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా అడ్వైజర్ శివకుమార్, రజక సంఘం చైర్మన్ మధు చందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ న్యూ శాయంపేట చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు అనిల్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి రమేష్ యాదవ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గొట్టే మహేందర్ పాల్గొన్నారు.
నవతెలంగాన-ఎల్కతుర్తి
ఆదివారం స్థానిక బస్టాండ్ కూడలి వద్ద చాకలి ఐలమ్మ 126వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుఖినే సంతాజీ, మండల ప్రధాన కార్యదర్శి, గొర్రె మహేందర్, నాయకులు శనిగరపు వెంకటేష్, హింగే శ్రీకాంత్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ- పర్వతగిరి
చింతనెక్కొండలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గటిక సుష్మ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్నోజు దేవేందర్, వార్డు సభ్యులు, జీడీ గట్టయ్య, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యాదర్శులు తాశంశెట్టి రఘు, కార్యదర్శి జీడీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-శాయంపేట
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుటనున్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, రజక సంఘం సోదరులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొప్పులలో గ్రామ కో-ఆప్షన్ సభ్యులు వైనాల రాజేందర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు అలువాల శ్రీధర్, జాలిగపు అశోక్, రాయరాకుల మొగిలి, ప్రశాంత్, పాల్గొన్నారు.
నవతెలంగాణ-కాజీపేట..
46వ డివిజన్లో చాకలి ఐలమ్మ జయంతిని స్థానిక కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కార్పొరేటర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లికొండ వినోద్‌కుమార్, నర్మెట బిక్షపతి గాండ్ల, తక్కలపెల్లి దేవేందర్తదితరులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ 126వ జయంతిని టీఆర్ఎస్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ టీిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నర్లగిరి రమేష్‌లు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఫాతిమా జంక్షన్లో మాజీ కార్పొరేటర్ నార్ల గిరి రామలింగం ఆధ్వర్యంలో అన్నదాన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఎలకంటి రాములు ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు నార్లగిరి రమేష్, దళపతి పాల్గొన్నారు.
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
సీకేఎం కళాశాల ఎదుట చాకలి ఐలమ్మ జయంతిని 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. విద్యావెత్త డా|| సిలువేరు హరినాధ్ మాట్లాడుతూ.. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ఆమె చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాలడుగుల సురేందర్, కాలువల చంద్రమౌళి, ఐలయ్య, పసునూటి ప్రభాకర్, చందనగిరి వేణు, దశరధం, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నల్లబెల్లి
మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షుడు రాపాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నానబోయిన రాజారాం, ఎంపీటీసి జన్ను జయరాజు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రజక సంఘం గౌరవాధ్యక్షుడు నాగేల్లి మొగిలి, ప్రధాన కార్యదర్శి వైనాల రాజు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొణిజేటి బిక్షపతి, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, సొసైటీ చైర్మన్ మారం రాము, మాజీ చైర్మన్ కొమ్మరెడ్డి రవీందర్ రెడ్డి, పెద్ద కొర్పోలు సర్పంచులు మహబూబ్ పాషా, అనంత లక్ష్మిరవి, సురేంధర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-రాయపర్తి
ఎంపీపీ కార్యాలయంలో ఆదివారం చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, డీపీఓ ప్రభాకర్, ఎంపీడీఓ కిషన్ నాయక్, ఎంపీఓ రాంమ్మోహన్, ఏపీఓ కుమార్, సర్పంచ్ గారె నర్సయ్య పాల్గొన్నారు.
నవతెలంగాణ-సంగెం.
స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో చాకలి ఐలమ్మ జయంతిని సర్పంచ్ గుండేటి బాబు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో రజక సంఘం ఆధ్వర్యంలో, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కళావతి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కందగట్ల నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సొసైటీ ఛైర్మన్ వేల్పుల కుమారస్వామి యాదవ్, స్థానిక ఉపసర్పంచ్ శరత్ బాబు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఆత్మకూరు
చాకలి ఐలమ్మ వీరత్వం తరతరాలకు ఆదర్శనీయమని ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆత్మకూర్ లో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాథమిక పరపతి సంఘం చైర్మన్ ఏరుకొండ రవీందర్, పీఏసీఎస్ డైరెక్టర్ రేవూరి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వాసు ఉప్పుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నడికూడ
స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ శ్రీలత ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ రవీందర్ రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దురీశెట్టి చంద్రమౌళి (చందు), గ్రామ కమిటీి అధ్యక్షులు నారగని శ్రీను, ప్రధాన కార్యదర్శి రావుల కిషన్‌లు ఘన నివాళులర్పించారు.
నవతెలంగాణ-పరకాల
చాకలి ఐలమ్మ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పటణాధ్యక్షుడు మడికొండ శ్రీను, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ బండి సారంగపాణి, పీిఏసీిఎస్ చైర్మన్లు నాగయ్య, లింగమూరి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిని వీరవనిత చాకలి ఐలమ్మని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రేపల్లె రంగనాథ్ అన్నారు. ఆదివారం ఆయన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రవణ్, యువజన నాయకులు బిర్ర రాజు,పథ్వీ, కడియం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ డా||తరుణ్ జోషి చాకలిఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్, సెంట్రల్ జోన్ డీసీపీలు వెంకటలక్ష్మీ, పుష్పారెడ్డి, ఏఆర్ ఏసీపీ సదానందం తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ -ఐనవోలు
కొండపర్తిలో సర్పంచ్ కట్కూరి రాజమణి బెన్సన్ అధ్వర్యంలో చాకలిఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దర్గా సోసైటి వైస్ చైర్మన్ మదాసు బాబు, గ్రామ వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు బోక్కల నారాయణ, వార్డు సభ్యులు రవికుమార పాల్గొన్నారు.
నవతెలంగాణ-నర్సంపేట
తెలంగాణ సాయుద పోరాట వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్ అన్నారు. ఆదివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పట్టణంలోని ఆమె విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రంలో మున్సిపల్ వైఎస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మ ప్రసాద్, మినిముల రాజు, దుష్యంత్ రెడ్డి, ఎండీ.పాషా, శీలం రాంబాబు, గోల్యానాయక్, రామసహాయం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రజక వృత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఇల్లందుల సాంబయ్య తదితరులు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. నాయకులు జన్ను రమేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లరించారు. .
రామవరంలో సర్పంచ్ కొడారి రవి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ విమల శంకర్, కిషన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. అనంతరం రజక కులం నుంచి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న స్థానిక ఎస్సై సాంబ య్యను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్య =క్రమంలో 66వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్, రజక సంఘం అధ్యక్షుడు గోపరాజు ఉదరు కుమార్, సదానందం ప్రతినిధులు పాల్గొన్నారు.