Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
బడుగులకు అండగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్, ఆ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య స్పష్టం చేశారు. మండలంలోని ఎంచగూడం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ అనుబంధ బీసీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొల్లబోయిన రాజేందర్, గ్రామ కమిటీ సభ్యులు చిగుర్ల కుమారస్వామి, జడ రమేష్ లతోపాటు వడకాల అనిల్, వడకాల మల్లేష్, సంగి సోమయ్య, రాజేందర్ ఎంచగూడెం ఉపసర్పంచ్ మిర్యాల అయిలయ్య ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్లో చేరగా వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీపీ విజయ, పార్టీ మండల అధ్యక్షుడు సారయ్య మాట్లాడారు. రాష్ట్రంలో, మండలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. పేద లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు భూపంపిణీ చేపట్టలేదన్నారు. రైతులకు రుణమాఫీ ప్రయోజనం చేకూర్చలేకపోయిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, మాజీ ఎంపీటీసీ బానోత్ రూప్సింగ్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సయ్యద్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వీరనేని వెంకటేశ్వర్లు, వెల్దండి వేణు, లక్ష్మీనర్సు, కట్రోజు భిక్షపతి, నామోజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.