Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
కల్లుగీత కార్మికుల కోసం గీతబంధు పథకాన్ని అమలు చేయాలని, ఏజెన్సీలో రద్దైన గీత కార్మిక సొసైటీలను పునరుద్ధరించాలని, సభ్యత్వమున్న కార్మికులకు బైక్ ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) జిల్లా అధ్యక్షుడు పులి చిన్న నర్సయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కాటాపూర్ తాటివనంలో ఆదివారం చేపట్టిన తాటి చెట్ల పంపకం కార్యక్రమంలో చిన్న నర్సయ్య గౌడ్ మాట్లాడారు. కల్లుగీత కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని, మృతి చెందిన కార్మికుల దహన సంస్కారాల కోసం రూ.25 వేలు ఇవ్వాలని, సొసైటీలకు 5 నుంచి 10 ఎకరాల భూమి కేటాయించాలని, జిల్లా కేంద్రంలో నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బార్ అండ్ వైన్స్ షాపుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్ల ప్రకటిడం వల్ల ప్రయోజనం లేదన్నారు. 2004లో అప్పటి రాష్ట ప్రభుత్వం కోటివరాల పథకంలో ఇచ్చిన భూమి సొసైటీలకు చెందేలా చర్యలు చేపట్టాలని, సదరు భూముల్లో హరితహారం పథకంలో మొక్కలు నాటి నీరందే ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ములుగు జిల్లా సభ్యులు పాలకుర్తి రవీందర్, ముస్తాధర్ గడ్డం శ్రీధర్, బెల్లంకొండ నాగేష్, తడక రవీందర్, రంగు సత్యనారాయణ, గండు సదయ్య, పులి రాజు, పాలకుర్తి ఖాజన్న, రంగు లాలయ్య, ఉపేందర్, బొలగం శ్రీను, బెల్లంకొండ రాజు, ఊరుకొండ స్వామి, తదితరులు పాల్గొన్నారు.