Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
రాష్ట్రంలో జీఓలు కాగితాలకే పరిమిత మవుతున్నాయని, ప్రభుత్వం నిద్రావస్థను వీడి 559, 1016 జీఓలను పకడ్బందీగా అమలు చేయాలని జీఎంపీిఎస్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్ర ంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. గత ప్రభుత్వాలు గొర్రెల మేత కోసం జీఓ 559 ప్రకా రం ప్రభుత్వం భూములను, చెరువు శిఖంలో గొర్రెల, మేకల మేతకోసం కల్పించిన హక్కును కొనసాగించాలన్నారు.1016 జీఓ ప్రకారం తుమ్మ చెట్లను కొమ్మలను పశువుల మేత కోసం ఉపయోగించుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్య ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించే సమయం ఆసన్నమైందన్నారు. పశువైద్యశాలలోని పోసు ్టలను భర్తీ చేయాలని, ప్రతి గ్రామంలో పశువుల వైద్యశాల భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా మహాసభల కరపత్రాలను ఆవి ష్కరించారు. సమస్యల పరిష్కారానికై సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వ హిస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి గాజు యాకయ్య పాల్గొన్నారు.