Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
వారసత్వ సంపదను కాపాడు కోవాలని జిల్లా టూరిజం అధికారి శివాజీ, డీపీఆర్వో లక్ష్మణ్కుమార్లు అన్నారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన బస్సులను డీపీఆర్వో లక్ష్మణ్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు బస్సులులో పర్యాటకులు బయలుదేరి రామప్ప దేవాలయం, ఘనపూర్ కోటగుళ్లు, పాండవుల గుట్టలు తదతర పర్యాటక ప్రదేశాలను వీక్షించారు. పర్యాటక శాఖ ఆధ్వ ర్యంలో సాంస్కతిక కార్యాక్రమాలను రామప్ప దేవాలయం వద్ద ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ అధికారులు, టూరిస్టు గైడ్లు పర్యాటక ప్రదేశాల వివరాలను వీక్షకులకు వివరించారు. అసిస్టెంట్ ఇంజినీర్ ఉషారాణి, టూరిజం అధికారులు సూర్య కిరణ్, వంశీ మోహన్, కె. లోకేశ్వర్, కొమురయ, సతీష్, ఖాదర్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, కాకతీయ యునివర్సిటీ విద్యార్థులు, యెగా సాధకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు