Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం..
రైతాంగ అభ్యున్నతికి కేసీఆర్ విశేష కృషి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వెంకటేశ్వర పల్లిలో జీపీ భవనికి శంకుస్థాపన
నవతెలంగాణ-రాయపర్తి
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివద్ధిలోనూ పాలకులు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించడంతో తెలంగాణ ప్రగతి పరవళ్లు తొక్కుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం వెంకటేశ్వరపల్లిలో రూ.లు 20లక్షల ఆర్జిఆఫ్ఏ నిధులతో నిర్మించనున్న జీపీ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ గోపితో విచ్చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం చరిత్రాత్మకమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి మంత్రి విచ్చేయగా అర్చకులు రామకష్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వర జలాలు జిల్లాలో, రాష్ట్రంలో పరుగులు తీస్తున్నాయన్నారు. కాలువలు, చెరువులు నిండుకుండల్లా మారాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతాంగ అభ్యున్నతికి చేస్తున్న కషి మరువలేనిదని వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలో కేసీఆర్ సమయస్ఫూర్తితో పాలన కొనసాగించారని, దాంతో కరోనాను నిర్మూలించడం సులభతరమైందన్నారు. ప్రజల రక్షణ కోసం ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులతో పాటు నిత్యావసర సరుకులు అందజేసినట్లు ఆయన గుర్తుచేశారు. 50 లక్షల రూపాయలతో ఆనందయ్య మందు పంపిణీ చేసినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తోందని తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీఆర్డిఏ పీడీ సంపత్ రావు, డీపీఓ ప్రభాకర్, ఆర్డీఓ మహేందర్జీ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్ నాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ గుబా యాకమ్మ, ఎంపీటీసీ గోవింద్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహా నాయక్, జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.