Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకుర్తి పంచాయతీ పాలకవర్గం
నవతెలంగాణ-పాలకుర్తి
రోడ్డు విస్తరణలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు పాలకుర్తి చౌరస్తాలో వ్యాపార సముదా యం షట్టర్లను నిర్మించాలని పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంత రావుతో పాటు పాలకవర్గ సభ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి వినతి పత్రాన్ని అందజేసి వారు మాటాడారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ ఆస్పత్రి వరకు షట్టర్లు నిర్మించాలని కోరారు. టూరిజం ప్యాకేజీ లో పర్యాటక కేంద్రంగా పాలకుర్తిని అబివృద్ధి చేస్తున్నారని, గ్రామంలో అండర్ డ్రైనేజీ తో పాటు సిసి రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు అధికా రులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. అక్టోబర్ 2న పాలకుర్తిలో జరిగే పలు అభివద్ధి కార్యక్ర మాలకు హాజరు కావాలని కోరారు. స్పందించిన మంత్రి గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయి స్తామన్నారన్నారు. వ్యాపార సముదాయాల నిర్మాణం కోసం ప్రజల భాగస్వామ్యం అవస రమన్నారు. పాలకుర్తి పట్టణాన్ని సుందరీ కరించి మరింత అభివద్ధి చేస్తానని భరోసా ఇచ్చినట్టు తెలిపారు. ఉప సర్పంచ్ తరాల చంద్రబాబు ,ఎంపీటీసీ పురుషోత్తం, కమ్మగాని నాగన్న, పాలక మండలి సభ్యులు కమ్మగాని రమేష్, మామిండ్ల లక్ష్మణ్, వీరమనేని హనుమంతరావు, మూల వెంకటేశ్వర్లు గౌడ్, అనుముల అంజి రావు, గాదెపాక యాదగిరి, బెల్లీ యుగంధర్, శివరాత్రి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.