Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంతలమయంగా ప్రధాన రహదారి
నవతెలంగాణ-జనగామ రూరల్
ఒకప్పుడు చిట్టడవితో కీకారణ్యంగా పేరున్న చంపక్ హిల్స్‌లో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో జన సంచారం పెరిగింది. జనగామ-సిద్ధిపేట ప్రధాన రహ దారిపై జనగామ మండలంలోని పసరమడ్ల, ఓబుల్ కేశపురం, వడ్లకొండ, పెద్దపాడు గ్రామాల పరిధిలో చంప హిల్స్ ప్రాంతం విస్తరించింది. ఇదేక్రమంలో ప్రధాన రహదారిపై భారీ వాహనాల రాకపోకలతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ప్రమాదకర మూలమలుపులు ఉండడంతో జనం జంకుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.