Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయ అధికారి మహేష్
నవతెలంగాణ-మల్హర్రావు
పంట మార్పిడి సాగుతో రైతులు లాభాలు పొందొచ్చని మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్‌యాదవ్ తెలిపారు. ఆదివారం మండలంలోని రుద్రారం రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ పాల్గొని మాట్లాడుతూ దీర్ఘకాలంగా వరి పంట వేయడం వల్ల భూగర్భజలాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్ధికంగా అభివృద్ధి చెందడంలేదన్నారు. యాసంగిలో ఆరు తడి పంటలు వేరుశనగ, నువ్వులు, మినుములు, కూర గాయలు సాగు చేయడం వల్ల ఆదాయం పొందవచ్చని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటూ రైతులకు సూచనలివ్వాలన్నారు. సర్పంచ్ పగడాల ధనలక్ష్మి, ఎఈవో మనీషా, రైతుబంధు సమితి అధ్యక్షులు విజయలక్ష్మి, లింగయ్య పాల్గొన్నారు.
మహాముత్తారం : వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ మండల అధికారి సతీష్ సూచించారు. ఆదివాొర మండ లంలోని బోర్లగూడెం సర్పంచ్ గంట వనజ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ రైతులతో అవగా హన సదస్సు నిర్వహించారు. ఏవో పాల్గొని రైతులకు పలు సూచనలిచ్చారు. వరికి ప్రత్యా మ్నాయంగా పెసర. మినుములు. జనుమ వంట లు వేసుకుంటే లాభదాయకమని తెలిపారు. కంపెనీల అగ్రిమెంట్ తో కూడిన హైబ్రిడ్ వరి విత్తనాల సాగు కూడా లాభదాయకమన్నారు. ఎంపీటీసీ లక్కి రెడ్డి నరసింహారెడ్డి, రైతు బంధు సమితి గ్రామ కన్వీనర్ ఠాగూర్ లక్ష్మణ్, సీహెచ్ దేవేందర్ రెడ్డి.కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ లావుడియా రామ్ సింగ్, రైతులు పాల్గొన్నారు.