Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు వాణిజ్య, వ్యాపార యాజమాన్యం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మెకు కనకారెడ్డి. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో గుండెబోయిన రాజు. కాటా సుధాకర్, ఎండీ శభానా అధ్యక్షతన నిర్వహిం మండల మహాసభలు నిర్వహించారు. సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు. దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, ప్రజా ప్రజావ్యతిరేక విధానాలు చేస్తూనే ఒకవైపు నిరుద్యోగ సమస్యను పెంచుతున్నారని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ఎక్కడికక్కడ ప్రైవేటు పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజల్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని అన్నారు. మూడు వ్యవసాయ వ్యతిరేఖ నల్ల చట్టాలను తీసుకు వచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా నేడు తలపెట్టిన భారత్ బంద్ లో ప్రజలు, రైతుకు, కార్మికులు, కూలీలందరు స్వచ్చందంగా పాల్గొనా లని పిలుపునిచ్చారు. మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య. నాయకులు, జువారి రమేష్, గంగరాజు, ఎస్కే ఇక్బాల్, నల్ల తీగల శ్రీను, రాజు, యాకయ, దూడయ్య. పాల్గొన్నారు.
భారత్ బంద్ జయప్రదం చేయాలి
నవతెలంగాణ- భూపాలపల్లి
మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, నూతన విద్యుత్ బిల్లు రద్దు చేయాలని వ్యవసాయ పంటలు అన్నింటికీ 50 శాతం ప్రాతిపదికగా కనీస మద్దతు ధరలు, చట్టబద్ధ హక్కును ఇచ్చే చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జరిగే భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో టీజేఎస్ జిల్లా కన్వీనర్ రత్నం కిరణ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహిం చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, జిల్లా నాయకులు వెంకటేష్, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాజయ్య, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ కర్ణాటక సమ్మయ్య పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్టు చట్టం వల్ల బడా కంపెనీలు కోరిన వాణిజ్య పంటలు పండిస్తూ చివరికి తమకు అవసరమైన ఆహార ధాన్యాలను కూడా పండించుకునే వెసులు బాటు రైతు కోల్పోతాడన్నారు. విత్తనాలు ఎరువులు తదితర ఉత్పాదకాల సేవలను కంపెనీల నుండి కొనాల్సిన అవసరం వస్తుందని అన్నారు. యాంత్రీకరణ వల్ల పని దినాలు తగ్గిపోయి రోజువారి కూలీల బతుకులు దుర్భరమవుతాయని అన్నారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రైవేటు చేతుల్లో ధరలు నిర్ణయించే స్థితి వస్తుందన్నారు. బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, విద్యార్థి యువజన సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని, వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బందుకు సహకరించి విజయవంతం చేయాలని కోరారు
మహాముత్తారం : నేడు దేశవ్యాప్త భారత్‌బంద్ పిలుపులో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో సీపీఐ (ఎం) నాయకులు, ఆదివాసీ, మైనారిటీ ప్రజా సంఘాల నాయకులు సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు పొలం చిన్న రాజేందర్ మాట్లాడుతూ... స్వామినాథన్ కమీషన్ సిఫార్సులకనుగుణంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలన్నారు. నూతన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలన్నారు. ,నిత్య జీవితవసర సరకుల ధరలు వ్వంటగ్యాసు, పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ విద్యను కాపాడాల న్నారు. భారత్‌బంద్‌లో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు మనేటి బాపు, గుండపు శ్రీను, ఆదివాసీ, మైనార్టీ సంఘాల నాయకులు పొలం సతీష్, బీసుల దేవేందర్, మహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.
గణపురం : కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని ధర్మపేట గ్రామంలో ఆకుల రవి, సంఘం శిరీష అధ్యక్షతన మండల మహాసభలు నిర్వహించారు. బంధు సాయిలుతోపాటు బొట్ల చక్రపాణి, చెన్నూరి రమేష్పాల్గొని మాట్లాడారు. నేడు జరిగే భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని అన్నారు. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మద్దతు ధర చట్టాన్ని తేవాలని వారు కోరారు, ధరణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరిక ట్టాలన్నారు. ఉపాధి హామీ పని దినాలను పెంచాలన్నారు పట్టణాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎర్ర మల్లేష్, జూకంటి రాజు, శంకర్ దేవేందర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి : కాంగ్రెస్
మల్హర్రావు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, నూతన బిల్లుల రద్దు,పంటల కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు చేపట్టబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఈ చట్టం కోసం రైతులు ఆందోళన చేస్తుంటే దీని గురించి పట్టించుకోకుండా,వ్యవసాయ రంగాలను కార్పొరేట్ లకు అప్పజెప్పే చట్టాలను చేయడం ఎవరి కోసమని ప్రశ్నిం చారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద ప్రజలపై భారం పడుతుంటే కార్పొరేట్ పన్నులు తగ్గిస్తూ వారికి సేవలు చేస్తుందన్నారు.
చిల్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ నేడు జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపుని చ్చారు. ఆదివారం మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్నకుస కూమర్(వెంకటాద్రిపేట ఎంపీటీసీ), కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది సురేష్ పాల్గొని మాట్లాడారు. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం దేశద్రోహమే అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు పెంచడం సబబుకాదన్నారు. విద్యుత్ ప్రయివేటీకరణతో వినియోగదారులపై చార్జీల భారం పడుతుందన్నారు. జాతిసంపదను అంబానీ, ఆదానీలకు అమ్ముతున్నారని విమర్శించారు. సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సాదం రమేష్, టీడీపీ మండల నాయకులు కనకం రవీందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ధార మహేందర్, మండల నాయకులు పాల్గొన్నారు.
జనగామ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా దేశంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి 19 అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు నిర్వహించే భారత్ బంద్‌కు అందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయా వ్యాపార వాణిజ్య సంస్థ యజమానులతో జంగారెడ్డి ఆదివారం సమావేశమై మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్యy, జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మను కలిసి బంద్ కు సహకరించాలని కోరారు. అంతకుముందు జిల్లా కేంద్రం లోని ప్రముఖ వ్యాపారి నాగయ్య అనారోగ్యంతో మతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు వేముల సత్యనారాయణ రెడ్డి, వై సుధాకర్ , డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదేపాకా రామ్‌చందర్, బుచ్చిరెడ్డి ఎండీ అన్వర్, మెడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.