Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. వర్షాకాల - 2021 సమావేశాల్లో భాగంగా సోమవారం నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రజల సౌకర్యార్థం బైపాస్ రోడ్డు కావాలని కోరారు. చెన్నై నుండి సిరొంచ వరకు జాతీయ రహదారి భూపాలపల్లి పట్టణం మధ్య నుండి వెళ్తోందని, దీనివల్ల అధిక రవాణా వాహనాలు, భారీ వాహనాలు వెళ్ళడం ద్వారా ట్రాఫిక్ అంతరాయం కలుగు తుందని వివరించారు. దానికి సంబంధించిన భూ సేకరణ త్వరగా నిర్వహించి బైపాస్ రోడ్డు పూర్తి చేయాలని కోరారు. తద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ బైపాస్ రోడ్డు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారన్నారు. దీంతో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు బైపాస్ రోడ్డు మంజూరవుతుందని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు